షార్జాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భారతీయ మహిళ!
ABN, First Publish Date - 2020-09-14T16:56:05+05:30
ఇండియాకు చెందిన 26ఏళ్ల మహిళ అనుమానస్పద స్థితిలో మరణించిన ఘటన షార్జాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షార్జాలో
షార్జా: ఇండియాకు చెందిన 26ఏళ్ల మహిళ అనుమానస్పద స్థితిలో మరణించిన ఘటన షార్జాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షార్జాలోని అల్ అజాజ్ ప్రాంతంలో నివసిస్తున్న 26ఏళ్ల భవన రామ్.. 16 అంతస్తుల భవనం పైనుంచి పడి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బంధువులు, స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2020-09-14T16:56:05+05:30 IST