ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్.. దుబాయిలో భారతీయుడి అద్భుతం

ABN, First Publish Date - 2020-07-10T04:05:40+05:30

యూఏఈలో భారత్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రోడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: యూఏఈలో భారత్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రోడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. న్యూఢిల్లీకి చెందిన సోహమ్ ముఖర్జీ అనే కుర్రోడు 30 సెకన్లలోనే 101 సార్లు స్టేషనరి రూలర్‌కు ఇరు పక్కల ఒంటి కాలుతో గెంతులేశాడు. దీంతో ఇంతకుముందు ఉన్న 96 హాప్స్(ఒంటి కాలుతో గెంతులేయడం) రికార్డును సోహమ్ ముఖర్జీ బద్దలు కొట్టాడు. కాగా.. సోహమ్ ముఖర్జీ ఈ సాహసాన్ని తన ఇంట్లోనే చేసి ఫోన్‌తో రికార్డ్ చేశాడు. సోహమ్ మొత్తంగా 110 హాప్స్ చేయగా.. ఇందులో 9 హాప్స్ చెల్లవని గిన్నిస్ బుక్ అధికారులు తొలగించారు. 9 హాప్స్ తీసేసినప్పటికి సోమమ్ మొదటిస్థానంలోనే నిలిచాడు. తాను 13 ఏళ్ల నుంచి మార్షల్ ఆర్ట్స్‌లో పాల్గొనడం కారణంగానే ఈ రికార్డ్ సాధించిగలిగినట్టు సోహమ్ ముఖర్జీ చెప్పాడు. లాక్‌డౌన్‌లో ఏదో ఒకటి సాధించాలనే కసితో తాను ఈ పని చేసినట్టు సోహమ్ చెప్పుకొచ్చాడు. కాగా.. సోహమ్ దుబాయిలోని జీఈఎమ్ఎస్ వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు.

Updated Date - 2020-07-10T04:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising