ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు.. స్వదేశానికి తీసుకెళ్లమంటూ..

ABN, First Publish Date - 2020-04-09T22:46:24+05:30

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి నేడు ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికి.. ప్రపంచ దేశాలు మాత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి నేడు ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికి.. ప్రపంచ దేశాలు మాత్రం కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ప్రపంచదేశాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో అమెరికన్లతో పాటు విదేశీయులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. అమెరికా వ్యాప్తంగా పది మందికి పైగా భారతీయులు కరోనా బారిన పడి మరణించినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో చిక్కుకున్న భారతీయులు తమను వెంటనే స్వదేశానికి తీసుకెళ్లమంటూ భారత ప్రభుత్వాన్ని అనేక సార్లు వేడుకున్నారు. తాజాగా ఇండియానాలో చిక్కుకున్న భారత విద్యార్థులు తమను రక్షించమంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. మొత్తం 11 మంది విద్యార్థులం అమెరికాలో చిక్కుకున్నామని.. వెంటనే భారత్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేయమని కేంద్రాన్ని కోరారు. కాగా... వీరంతా సూరత్‌తో పాటు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది.

Updated Date - 2020-04-09T22:46:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising