ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళపై దారుణం.. దుబాయిలో కటకటాలపాలైన భారతీయుడు!

ABN, First Publish Date - 2020-07-27T19:05:00+05:30

అత్యాచారం, దొంగతనం కేసులో 23ఏళ్ల భారతీయుడు.. దుబాయిలో కటకటాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: అత్యాచారం, దొంగతనం కేసులో 23ఏళ్ల భారతీయుడు.. దుబాయిలో కటకటాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయిలోని నైఫ్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో 39ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఫిబ్రవరిలో ఆ మహిళ.. తన కొడుకును స్కూల్ వ్యాన్ దగ్గర దిగబెట్టి, తిరిగి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో అక్కడ సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్న 23ఏళ్ల  భారతీయుడు.. మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా అత్యాచారాన్ని ఫోన్‌లో చిత్రీకరించి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను నెట్‌లో పోస్ట్ చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. అనంతరం మహిళ వద్ద ఉన్న 200 దిర్హాన్లను తీసుకుని పరారయ్యాడు. కాగా.. తన భర్త ఇంటికి చేరుకోగానే.. సదరు మహిళ జరిగిన విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 23ఏళ్ల యువకుడి కోసం గాలించి, పట్టుకున్నారు. ఆదివారం రోజు ఆ యువకుడ్ని దుబాయిలోని కోర్టులో హాజరుపర్చారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ.. తరుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. 


Updated Date - 2020-07-27T19:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising