ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాలకు తిరిగెళ్తున్న ప్రవాసులు: విదేశాంగశాఖ

ABN, First Publish Date - 2020-09-23T21:22:51+05:30

కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ప్రవాసులు.. తిరిగి విదేశాలకు వెళ్తున్నారని విదేశాంగశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ప్రవాసులు.. తిరిగి విదేశాలకు వెళ్తున్నారని విదేశాంగశాఖ ఓవర్సిస్ ఇండియన్ ఆఫైర్స్ విభాగం సెక్రటరీ సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వివిధ రంగాల్లో పని చేస్తున్న సుమారు 50వేల మంది భారత నిపుణులు.. తిరిగి గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రవాసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్ భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించిందన్నారు. ఈ మిషన్‌లో భాగంగా యూఏఈ నుంచి సుమారు 4,57,596 మంది ప్రవాసులు స్వదేశానికి చేరుకున్నట్లు వివరించారు. సౌదీ అరేబియా నుంచి 1,63,851 మంది, ఖతర్ నుంచి 1,04,444 మంది, ఓమన్ నుంచి 90,759 మంది భారతీయులు స్వదేశానికి వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా మహమ్మారి నేపథ్యంలో వైద్య సిబ్బంది, వైద్య పరికరాలను భారత ప్రభుత్వం.. గల్ఫ్ దేశాలకు పంపిందని ఆయన గుర్తు చేశారు. 


Updated Date - 2020-09-23T21:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising