ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్

ABN, First Publish Date - 2020-06-07T09:59:47+05:30

అమెరికాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఇండియన్ ఓవర్సీస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ ఖండించింది. వీలైనంత త్వరగా గాంధీ విగ్రహాన్ని పునరుద్దరించాలని నేషనల్ పార్క్ సర్వీస్‌ను కోరింది. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అట్టుడుకుతున్న విషయం విధితమే. దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకూ మిన్నంటుతున్నాయి. ఇదే సమయంలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బిల్డింగ్‌లను, కార్లను ధ్వంసం చేస్తున్నారు. వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీ సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని సైతం నిరసనకారులు ధ్వంసం చేశారు. నేషనల్ పార్క్ సర్వీస్ పర్యవేక్షణలో ఉండే చిన్న పార్క్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. శాంతికి చిహ్నమైన గాంధీ విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం చేయడం బాధ కలిగించందటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ డీసీ చాప్టర్ అధ్యక్షులు జాన్సన్ మాయావిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. నేషనల్ పార్క్ సర్వీస్ యాక్టింగ్ డైరెక్టర్ డేవిడ్ వేలాకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఓ లేఖ రాసింది. గాంధీ విగ్రహం పునరద్దరణకు అయ్యే ఖర్చును భరించేందుకు సుముఖంగా ఉన్నట్టు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ లేఖలో పేర్కొంది.

Updated Date - 2020-06-07T09:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising