ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్‌లో భారత సంతతి న్యాయవాదికి 27 నెలల జైలు శిక్ష !

ABN, First Publish Date - 2020-09-29T19:04:15+05:30

క్లయింట్స్ చెల్లించిన ఫీజులను దుర్వినియోగం చేసిన కేసులో భారత సంతతి న్యాయవాదికి సింగపూర్ న్యాయస్థానం సోమవారం 27 నెలల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్ సిటీ: క్లయింట్స్ చెల్లించిన ఫీజులను దుర్వినియోగం చేసిన కేసులో భారత సంతతి న్యాయవాదికి సింగపూర్ న్యాయస్థానం సోమవారం 27 నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే... జమీందర్ సింగ్ గిల్(57) అనే భారత సంతతి న్యాయవాది తన కంపెనీకి చెందిన క్లయింట్స్ చెల్లించిన 31వేల సింగపూర్ డాలర్లు(రూ. 16.68 లక్షలు) తన పర్సనల్ బ్యాంక్ ఖాతాలోకి మళ్లీంచుకున్నాడు. అనంతరం ఆ నగదును తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నాడు.


2016-19 మధ్య హిల్బోర్న్ లాలో లీగల్ అసోసియేట్‌గా పనిచేసిన జమీందర్... ఇలా కంపెనీ సొమ్మును అక్రమంగా తన ఖాతాలో జమ చేసుకుని కుటుంబ అవసరాల కోసం వినియోగించుకున్నాడు. అయితే, ఓ క్లయింట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2019, జూలై 18న అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో స్వదేశానికి వచ్చిన జమీందర్ తిరిగి అక్టోబర్‌లో సింగపూర్ వెళ్లాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఈ కేసు సింగపూర్ న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. దీంతో జమీందర్‌ను ఐదు నేరాల్లో దోషిగా తేల్చిన కోర్టు 27 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

Updated Date - 2020-09-29T19:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising