ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెడ్డాలో భారతీయుడ్ని హతమార్చిన పాకిస్తానీ !

ABN, First Publish Date - 2020-12-01T18:17:24+05:30

సౌదీ అరేబియాలోని జెడ్డాలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో దారుణం జరిగింది. భారత వ్యక్తిని ఓ పాకిస్తానీ అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. మృతుడిని కేరళ రాష్ట్రం మలప్పురంలోని కూట్టిలంగడికి చెందిన అబ్దుల్ అజీజ్‌గా జెడ్డా పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత ఘర్షణలో భాగంగానే పాక్ వ్యక్తి అజీజ్‌పై విచక్షణరహితంగా కత్తితో దాడికి పాల్పడినట్టు తోటి కార్మికులు తెలిపారు. అజీజ్‌ను రక్షించే క్రమంలో తమకు కూడా గాయాలైనట్లు కేరళ రాష్ట్రానికే చెందిన కార్మికుడు, బంగ్లాదేశ్ వ్యక్తి పోలీసులకు తెలిపారు. కాగా, అజీజ్ జెడ్డాలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో ఓ ఫార్మాస్యూటికల్ సొల్యూషన్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అజీజ్ మృతితో అతని స్వస్థలం కూట్టిలంగడిలో విషాదం అలుముకుంది. అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.      


Updated Date - 2020-12-01T18:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising