ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వందే భారత్ మిషన్’పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ABN, First Publish Date - 2020-05-23T21:46:45+05:30

‘వందే భారత్ మిషన్’ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘వందే భారత్ మిషన్’ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘వందే భారత్ మిషన్’ మొదటి దశలో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు. కాగా.. మే 16 నుంచి ‘వందే భారత్ మిషన్’ రెండో దశ కూడా ప్రారంభమైంది. అయితే ‘వందే భారత్ మిషన్’ రెండో దశకు మే 22 చివరి తేదీ కాగా.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మిషన్‌ రెండో దశను జూన్ 13 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 


ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో న్యూయార్క్‌లో చిక్కుకున్న సుమారు 100 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. న్యూయార్క్‌లో చిక్కుకున్న వారి కోసం ఏర్పాటు చేసిన మొదటి ప్రత్యేక విమానం శనివారం మధ్యాహ్నం చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ 100 మందిలో సుమారు 60 మంది పంజాబ్‌కు చెందిన వారు ఉండగా.. హర్యానాకు చెందిన వారు 12 మంది, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు 16 మంది, ఉత్తరాఖండ్‌, చండీగఢ్‌కు చెందిన వారు ఉన్నారు. కాగా.. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, క్వారెంటైన్ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. 


Updated Date - 2020-05-23T21:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising