జర్మనీలో భారతీయ వ్యక్తిపై గూఢచర్యం కేసు.. కోర్టులో విచారణ..
ABN, First Publish Date - 2020-05-10T00:15:15+05:30
జర్మనీలో సిక్కులు, కాశ్మీరీలపై గూఢచర్యం చేసినందుకు ప్రస్తుతం ఓ భారత వ్యక్తి స్థానిక ఫెడరల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు.
బెర్లిన్: జర్మనీలో సిక్కులు, కాశ్మీరీలపై గూఢచర్యం చేసినందుకు ప్రస్తుతం ఓ భారత వ్యక్తి స్థానిక ఫెడరల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. న్యూఢిల్లీలోని ఓ సీక్రెట్ ఏజెన్సీ కోసం అతను పని చేసినట్లు శుక్రవారం జరిగిన కోర్టు విచారణలో తేలింది. నిందితుడు బల్వీర్(54)... భారత ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కోసం 2015 నుండి పని చేస్తున్నట్లు తేల్చారు. ఐదేళ్లుగా జర్మనీలోని సిక్కులు, కాశ్మీరీలపై గూఢచర్యం నిర్వహించిన బల్వీర్ ఆ సమాచారాన్ని ఏజెన్సీకి అందజేసినట్లు ఫ్రాంక్ఫర్ట్ న్యాయస్థానం పేర్కొంది. ఆగస్టు 25న మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు రానుంది. గత డిసెంబర్‌లో ఇదే న్యాయస్థానం సిక్కులు, కాశ్మీరీలపై గూఢచర్యం నిర్వహించిన ఓ భారతీయ జంటను కూగా దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.
Updated Date - 2020-05-10T00:15:15+05:30 IST