ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబుధాబి బిగ్ టికెట్.. భారతీయుడికి జాక్‌పాట్ !

ABN, First Publish Date - 2020-12-04T13:59:00+05:30

దుబాయిలో ఉండే భారతీయుడికి అబుధాబి బిగ్ టికెట్ లాటరీలో జాక్‌పాట్ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: దుబాయిలో ఉండే భారతీయుడికి అబుధాబి బిగ్ టికెట్ లాటరీలో జాక్‌పాట్ తగిలింది. గురువారం నిర్వహించిన ది డ్రీమ్ 12 మిలియన్ రాఫెల్ డ్రాలో జార్జీ జాకబ్స్(51) అనే భారతీయుడు 12 మిలియన్ దిర్హమ్స్(రూ.2,41,187,520) గెలుచుకున్నాడు. నవంబర్ 30న జాకబ్స్ కొన్న టికెట్ నెంబర్ 069402కు ఈ జాక్‌పాట్ తగిలింది. రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో బిగ్ టికెట్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. దుబాయిలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న జాకబ్స్... వైద్య పరికరాల సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రోజు ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో లాటరీ నిర్వహకులు ఆయనకు బిగ్ టికెట్ లాటరీ గెలిచినట్లు ఫోన్ ద్వారా తెలియజేశారు.


కానీ, మొదట ఆయన నమ్మలేదు. ఆ తర్వాత ఆయన కొన్న టికెట్ నెంబర్, సిరీస్ నెంబర్ కూడా నిర్వహకులు చెప్పడంతో నిజంగానే తాను గెలిచినట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో జాకబ్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ నిర్వహకులు తాను విన్నర్ అని చెప్పిన ఈ వార్త తన జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసిందని జాకబ్స్ ఆనందం వ్యక్తం చేశాడు. తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు తన ఇద్దరు పిల్లల చదువు, ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని జాకబ్స్ చెప్పుకొచ్చాడు.  

Updated Date - 2020-12-04T13:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising