ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయిలో భారతీయురాలి ఉదారత.. భవన నిర్మాణ కార్మికుల కోసం..

ABN, First Publish Date - 2020-03-26T15:28:33+05:30

దుబాయిలో ఉండే బ్లూ కాలర్ వర్కర్స్ కోసం ఓ ప్రవాస భారతీయురాలు తాజాగా తన వంతు సాయంగా కేర్ ఫ్యాక్స్ పంచి పెడుతూ ఉదారతను చాటుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: మహమ్మారి కరోనా వైరస్(కొవిడ్-19) గల్ఫ్ దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్ దేశాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటి వరకు జీసీసీ(గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్)లో సుమారు 2వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దుబాయిలో కూడా ఈ వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీనితో దుబాయ్ సర్కార్ ఈ మహమ్మారి వ్యాప్తి , నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా దేశ ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. మసీదులు, స్కూల్స్, మాల్స్ అన్నింటిని మూసివేసింది. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. 


ఇది ఇలా ఉంటే దుబాయిలో ఉండే బ్లూ కాలర్ వర్కర్స్ కోసం ఓ ప్రవాస భారతీయురాలు తాజాగా తన వంతు సాయంగా కేర్ ఫ్యాక్స్ పంచి పెడుతూ ఉదారతను చాటుకుంటోంది. కరోనా నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితం కావడంతో వారికి చేతిలో పని లేకుండా పోయింది. దాంతో ఆదాయం లేక దీన స్థితిలో ఉన్నారు. మరోవైపు కరోనా కోరలు చాస్తుడడంతో కార్మికులకు ఏం చేయాలో తోచడం లేదు. ఇలా విపత్కర పరిస్థితులను ఎదురుకుంటున్న వర్కర్లకు తన వంతు సహాయంగా ఉచితంగా కేర్ ఫ్యాక్స్ అందిస్తోంది భారత ప్రవాసీయురాలు, సామాజిక కార్యకర్త అయేషా ఇస్మాయిల్ బేగం. దుబాయిలో వివిధ ప్రాంతాలలో పని చేస్తున్న బ్లూ కాలర్ వర్కర్స్ కోసం 230 కేర్ పాక్స్  సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో వాటిని దుబాయిలోని క్విసిస్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులకు డిస్ట్రిబ్యూట్ చేస్తానని ఆమె తెలిపింది.


తన చారిటీ సంస్థ ద్వారా పంచి పెట్టబోతున్న ఈ కేర్ ఫ్యాక్స్ ఒక్కొ దాని విలువ రూ. 300 అని అయేషా పేర్కొంది. ఈ ఫ్యాక్ లో ఒక శానిటైజెర్ బాటిల్, మాస్క్, హ్యాండ్ వాష్ కంటైనర్ ఉంటాయంది. తన చారిటీ సంస్థకు ఇస్లామిక్ అఫైర్స్, చారిటబుల్ ఆక్టివిటీస్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఉన్నట్లు బేగం తెలిపింది. తమ చారిటబుల్ సంస్థ ద్వారా ఈ విపత్కర పరిస్థితో బ్లూ కాలర్ వర్కర్స్ కు చేతనైన సాయం చేస్తామని ఆమె పేర్కొంది. అయేషా గత 11 ఏళ్లుగా ఈ చారిటీ సంస్థను నడిపిస్తోంది. ముఖ్యముగా ఉపాధి కోసం దేశం కాని దేశం వచ్చి కష్టపడే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో ఆమె ముందు ఉంటారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ కేర్ ఫ్యాక్స్ పంచి పెట్టేదేందుకు ముందుకు వచ్చింది. అలాగే కార్మికుల్లో కరోనా పట్ల వారిలో అవగాహన కల్పిస్తానని ఆమె పేర్కొంది. దుబాయిలోని ప్రతీ భవన నిర్మాణ సైట్స్ తోపాటు సోనాపూర్, సజ్జా, బార్షా ప్రాంతాల్లోని లేబర్ క్యాంపుల్లో ఈ కేర్ ఫ్యాక్స్ ను కార్మికులకు అందజేస్తానని అయేషా తెలిపింది. ఇలా ఓ భారతీయురాలు దుబాయిలో ఉదారతను చాటుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. 

Updated Date - 2020-03-26T15:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising