ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజిస్ట్రేషన్ డ్రైవ్.. కువైట్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2020-09-16T14:15:02+05:30

కువైట్‌లోని భారత ప్రవాసుల కోసం నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ డ్రైవ్ విషయమై అక్కడి భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత ప్రవాసుల కోసం నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ డ్రైవ్ విషయమై అక్కడి భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక ప్రకటన చేసింది. ట్రావెల్ డాక్యుమెంట్ కోసం నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌ కోసం భారతీయులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు(ఈసీలు) ఉన్న భారతీయులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఎంబసీ కోరింది. ఇలా ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేసుకున్న ప్రతి భారతీయ పౌరులను నిర్ణీత సమయంలో ఎంబసీ ఎంబసీ సంప్రదిస్తుందని తెలియజేసింది. ప్రయాణ పత్రాలు లేనివారందరూ చెల్లుబాటు అయ్యే ఈసీలతో ఆన్‌లైన్‌(https://forms.gle/pMf6kBxix4DYhzxz7)లో గూగుల్ ఫారమ్ నింపి నమోదు చేసుకోవాలని ఎంబసీ అధికారులు సూచించారు. లేదా ఫిల్ చేసిన ఫారమ్‌ను ఎంబసీ కాన్సులర్ హాల్, భారత పాస్‌పోర్టు ఆఫీసులు గల షరాక్, జలీబ్ అల్ షువైఖ్, ఫహహీల్‌ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులలో వేయవచ్చని పేర్కొంది. ఏదైనా అనుమానం ఉంటే community.kuwait@mea.gov.inకు మెయిల్ చేయాల్సిందిగా కోరింది. ఇక భారతీయ ప్రయాణ పత్రాల కోసం నిర్వహిస్తున్న ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ ప్రస్తుతం సజావుగా కొనసాగుతోందని పేర్కొన్న రాయబార కార్యాలయం.. ఇది పూర్తి ఉచిత సర్వీస్ అని తెలియజేసింది. దీనిని భారత ప్రవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Updated Date - 2020-09-16T14:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising