ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌లోని భారత ఎంబసీలో దీపావళి వేడుకలు !

ABN, First Publish Date - 2020-11-13T12:42:43+05:30

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దీపావళి పండుగనున పురస్కరించుకుని గురువారం వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన భారత ప్రవాసులకు స్వీట్లు పంచిపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్‌ సిటీ: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దీపావళి పండుగనున పురస్కరించుకుని గురువారం వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన భారత ప్రవాసులకు స్వీట్లు పంచిపెట్టింది. దీంతో కార్యాలయంలో దీపావళి వేడుకల కోలాహల వాతావరణం నెలకొంది. ఇక దీపావళి ఆనందం, దీపాల పండుగ అనేది తెలిసిందే. అలాగే చీకటిపై కాంతి విజయానికి చిహ్నంగా, చెడుపై మంచి గెలుపుకు గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. ఈసారి దీపావళి పండుగ ఈ నెల 14న(శనివారం) వచ్చింది. దీంతో గురువారం తమ పనుల నిమిత్తం ఎంబసీకి వచ్చిన భారత ప్రవాసులకు కార్యాలయం సిబ్బంది దీపావళి స్వీట్లు పంపిణీ చేసి వారిలో ఆనందాన్ని నింపింది. కాగా, దీపావళి నేపథ్యంలో వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టిన ఎంబసీకి కమ్యూనిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.    

Updated Date - 2020-11-13T12:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising