ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబా మృతికి సంతాపంగా.. ఎంబసీ, పాస్‌పోర్ట్ కేంద్రాలకు 3రోజులు సెలవు

ABN, First Publish Date - 2020-09-30T16:01:43+05:30

కువైట్‌ రాజు షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ సబా (91) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కువైట్‌ రాజు షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ సబా (91) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది. అలాగే సబా మృతికి సంతాపంగా కువైట్‌లోని భారత ఎంబసీతో పాటు షరాక్, ఫహహీల్, అబ్బాసియాలోని పాస్‌పోర్ట్ కేంద్రాలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు మూడు రోజులు సెలవులు ఇచ్చింది. అయితే, ఎమర్జెన్సీ కాన్సులర్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని ఎంబసీ పేర్కొంది.   


భారత రాయబారి సీబీ జార్జ్ మాట్లాడుతూ... సబా మరణం కువైట్ కింగ్‌డమ్‌కు తీరని లోటు అని అన్నారు. గ్రేట్ లీడర్‌ను కోల్పోవడం ఎంతో బాధాకరం అని జార్జ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కువైట్‌లోని భారత సమాజం తరఫున రాయబారి సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-09-30T16:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising