ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టు 15న పాకిస్థానీలు ధర్నాలు చేయకుండా చూడాలంటూ.. యూకేలోని భారతీయులు..

ABN, First Publish Date - 2020-08-11T02:42:43+05:30

భారతదేశ స్వాతంత్ర్యదినోత్సవం అయిన ఆగస్టు 15న లండన్‌లోని ఇండియన్ హైకమిషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: భారతదేశ స్వాతంత్ర్యదినోత్సవం అయిన ఆగస్టు 15న లండన్‌లోని ఇండియన్ హైకమిషన్ వద్ద ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా చూడాలని యూకేలోని భారతీయులు ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు. ఆగస్టు 15 అంటే భారతీయులకు స్వేచ్ఛ కలిగిన రోజని.. ఆ రోజును ఎంతో ఆనందంగా జరుపుకుంటామని భారతీయులు లేఖలో ప్రస్తావించారు. అయితే ప్రతి ఏడాది ఇదే రోజున పాకిస్థానీలు, వారికి మద్దతు తెలిపే ఖలిస్థానీ మద్దతుదారులు ఇండియన్ హైకమిషన్ వద్ద ధర్నాలు చేస్తూ వస్తున్నట్టు లేఖలో ప్రస్తావించారు. భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోకూడదని పాకిస్థానీలు తమపై దాడులకు పాల్పడుతున్నట్టు లేఖలో చెప్పుకొచ్చారు. గతేడాది మారణాయుధాలతో పాకిస్థానీలు తమపై దాడులు చేశారని.. ఈ ఘటనలో పోలీసు అధికారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయని గుర్తుచేశారు. పాకిస్థానీలు, వారి మద్దతుదారులు హింసాత్మక ధర్నాలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తోందని.. దీని వల్ల భారతీయులపై దాడులు జరుగుతున్నాయని బోరిస్ జాన్సన్‌కు తెలిపారు. ఈ సారి ఇండియన్ హైకమిషన్ వద్ద ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని భారతీయులు బోరిస్ జాన్సన్‌ను కోరారు. కాగా.. ఇదే కాపీని ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు సెక్రటరీ హోమ్ డిపార్ట్‌మెంట్‌కు, లండన్ మేయర్‌కు, లండన్ మెట్రో పోలీసులకు కూడా భారతీయులు పంపారు.

Updated Date - 2020-08-11T02:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising