ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

34 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ల విరాళం.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-04-10T03:45:09+05:30

భారత సంతతికి చెందిన ఆమ్నీల్ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ అమెరికా ప్రభుత్వానికి 34 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను విరాళంగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఆమ్నీల్ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ అమెరికా ప్రభుత్వానికి 34 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను విరాళంగా ప్రకటించింది. 20 లక్షల టాబ్లెట్లను న్యూయార్క్‌కు, పది లక్షల టాబ్లెట్లు టెక్సాస్‌కు విరాళంగా ఇస్తున్నట్టు సంస్థ పేర్కొంది. మరో నాలుగు లక్షల టాబ్లెట్లు లూసియానాకు ఇవ్వనున్నట్టు తెలిపింది. చిరాగ్, చింటు పటేల్ అనే భారతీయులు న్యూజెర్సీ కేంద్రంగా ఆమ్నీల్ ఫార్మాస్యూటికల్స్‌ను నడుపుతున్నారు. ఏప్రిల్ చివరి నాటికి 2 కోట్ల టాబ్లెట్లను తయారుచేసి దేశవ్యాప్తంగా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించనున్నట్టు చిరగ్, చింటు తెలియజేశారు. కాగా.. హైడ్రాక్సీక్లోరిక్విన్‌ను అమెరికా పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల మోదీని కోరిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఏ దేశాలకు అవసరముందో ఆ దేశాలకు ఎగుమతి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-04-10T03:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising