ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌'గా 15 ఏళ్ల తెలుగమ్మాయి !

ABN, First Publish Date - 2020-10-30T16:14:16+05:30

అమెరికాలో స్థిరపడిన 15 ఏళ్ల తెలుగమ్మాయి నిత్యా కొడాలి అరుదైన ఘనత సాధించారు. తొలిసారి నిర్వహించిన 'మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌' అందాల పోటీల్లో విజేతగా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అమెరికాలో స్థిరపడిన 15 ఏళ్ల తెలుగమ్మాయి నిత్యా కొడాలి అరుదైన ఘనత సాధించారు. తొలిసారి నిర్వహించిన 'మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌' అందాల పోటీల్లో విజేతగా నిలిచారు. భారత్ సహా 40 దేశాల నుంచి 18,000 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. కాగా, మిస్ టీన్ తెలుగు యూనివర్స్ గ్రాండ్ ఫైనల్‌‌కు 22 మంది ఎంపికయ్యారు. ఈ ఫైనలిస్టులలో కొడాలి ఒకరు. ఈ పోటీల్లో తెలుగు ఉచ్ఛారణ, రాంప్ వాక్, టాలెంట్, ప్రశ్నలు- సమాధానాలు ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. దీంతో నిత్యా కొడాలి విజేతగా నిలిస్తే... మొదటి రన్నరప్‌గా సాత్విక మోవ్వా, సెకండ్ రన్నరప్‌గా సుష్మితా కొల్లోజు నిలిచారు. కాగా, ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిస్ ఎర్త్ ఇండియా తేజస్విని మనోజ్ఞ... విజేతగా నిలిచిన నిత్యకు కీరిటాన్ని ధరింపజేశారు.   


నిత్య ప్రస్తుతం సోఫోమోర్‌లోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆమెకు భరతనాట్యంలో కూడా ప్రవేశం ఉంది. అలాగే హ్యూస్టన్ బాలీవుడ్ నృత్య బృందంలో సభ్యురాలు. తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహించడానికి స్వచ్ఛందంగా హ్యూస్టన్ స్థానిక తెలుగు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇక తాను మొదటిసారి పాల్గొన్న పోటీల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ గెలవడం పట్ల నిత్య ఆనందం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని, ఈ విజయం తనలో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిందని తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో నిత్య రాసుకొచ్చారు.

Updated Date - 2020-10-30T16:14:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising