ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకేలో భారత సంతతి మంత్రికి కరోనా పాజిటివ్?

ABN, First Publish Date - 2020-06-04T21:51:39+05:30

యూకేలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: యూకేలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తి అలోక్ శర్మకు వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. బుధవారం యూకే పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఆయన అలసటకు గురయ్యారు. ఆయనకు చెమటలు పడుతూ ఉండటంతో కరోనా సోకిందేమోనన్న అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అలోశ్ శర్మ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒకవేళ అలోక్ శర్మకు కరోనా సోకితే.. బుధవారం పార్లమెంట్‌లో ఆయనకు 2 మీటర్ల దూరంలో ఉన్న వారంతా రెండు వారాల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. పార్లమెంట్‌‌లో అలోక్ శర్మకు లేబర్ పార్టీకి చెందిన ఎడ్ మిలిబాండ్ గ్లాసుతో నీళ్లు అందించినట్టు తెలుస్తోంది. అలోక్ శర్మకు కరోనా పాజిటివ్ వస్తే ఎడ్ మిలిబాండ్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌ సమావేశాలకు ఎంపీలు హాజరయ్యేందుకు ఇటీవల ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో అనేక మంది ఎంపీలతో కలిసి అలోక్ శర్మ కూడా పాల్గొన్నారు. దీంతో అలోక్ శర్మ కరోనా పరీక్ష ఫలితాల కోసం పార్లమెంట్ మొత్తం వేచి చూస్తోంది.

Updated Date - 2020-06-04T21:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising