8వసారి..ఐరాస భద్రతా మండలికి ఎన్నికైన భారత్..!
ABN, First Publish Date - 2020-06-18T08:04:47+05:30
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ 8వసారి ఎన్నికయ్యింది. 192 ఓట్లకుగాను 184 ఓట్లు పొంది.. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ 8వసారి ఎన్నికయ్యింది. 192 ఓట్లకుగాను 184 ఓట్లు పొంది.. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ మరో రెండు సంవత్సరాలు కొనసాగనుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉంటాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా.. 10 తాత్కాలిక సభ్యదేశాలు. తాత్కాలిక సభ్యదేశాలు రెండేళ్ల కాలవ్యవధి కొరకు ఎన్నికవుతాయి. భద్రతా మండలిలో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్‌లు శాశ్వత సభ్యదేశాలు. ఈ దేశాలకు వీటో అధికారం ఉంటుంది. ఏదైనా విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలంటే ఈ ఐదు దేశాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది.
Updated Date - 2020-06-18T08:04:47+05:30 IST