ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ చేతిలో డ్రాగన్ చిత్తు !

ABN, First Publish Date - 2020-09-16T12:06:02+05:30

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాపై భారత్‌కు ఓ చిరు విజయం! అది యుద్ధంలో కాదు.. ఎన్నికల్లో! అది కూడా ఐక్యరాజ్య సమితిలో!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాస మహిళా కమిషన్‌ సభ్య దేశంగా ఎన్నిక

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబరు 15: సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాపై భారత్‌కు ఓ చిరు విజయం! అది యుద్ధంలో కాదు.. ఎన్నికల్లో! అది కూడా ఐక్యరాజ్య సమితిలో! లైంగిక సమానత్వం, మహిళా సాధికారత లక్ష్యంగా పని చేసే మహిళల స్థాయికి సంబంధించిన ఐరాస కమిషన్లో భారత్‌ సభ్యురాలిగా ఎన్నికైంది.


ఐరాసలో ప్రతిష్ఠాత్మక కమిషన్‌ ఆన్‌ ద స్టేటస్‌ ఆఫ్‌ విమెన్‌(సీఎ్‌సడబ్ల్యూ)లో 54 మంది సభ్యులుంటారు. సీఎ్‌సడబ్ల్యూలో ఆసియా పసిఫిక్‌ కేటగిరీకి సంబంధిం చి రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటికి సోమవారం ఎన్నికలు జరిగాయి. ఆ స్థానాల కోసం అఫ్ఘానిస్థాన్‌, భారత్‌, చైనా పోటీ పడ్డాయి. అఫ్ఘానిస్థాన్‌ 39 ఓట్లు; భారత్‌ 38 ఓట్లను సాధించాయి. ఐరాసలో శాశ్వత సభ్య దేశమైన చైనాకు వచ్చిన ఓట్లు కేవలం 27. అంటే, ఆ దేశం సగం ఓట్లను కూడా తెచ్చుకోలేకపోయింది.


భారత్‌, అఫ్ఘాన్‌ నాలుగేళ్లు పదవిలో కొనసాగుతా యి. సీఎ్‌సడబ్ల్యూ సభ్యదేశంగా భారత్‌ ఎన్నికైందని, లైంగిక స మానత్వం, మహిళా సాధికారత దిశగా చేసే కృషికి ఇది తిరుగులేని గుర్తింపని ఐరాసలో భారత శాశ్వత రా యబారి టీఎస్‌ తిరుమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే, ఐరాస ఎకనామిక్‌ మరియు సోషల్‌ కౌన్సిల్‌లో భాగమైన కమిషన్‌ ఆన్‌ పాపులేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌(సీపీడీ), కమిటీ ఫర్‌ ప్రోగ్రామ్‌ అండ్‌ కో ఆర్డినేషన్‌ (సీపీసీ)ల్లోనూ భారత్‌ ఒక్కో సీటు సాధించింది.

Updated Date - 2020-09-16T12:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising