లాక్‌డౌన్ తర్వాతే యూఏఈలోని ఎన్నారైలకు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి
ABN, First Publish Date - 2020-04-12T18:09:01+05:30
లాక్‌డౌన్ ముగిసే వరకు ఎన్నారైలెవరికీ ఇండియా వెళ్లే అవకాశం లేదని యూఏఈలోని భారత ఎంబసీ తెలిపింది.
యూఏఈ: లాక్‌డౌన్ ముగిసే వరకు ఎన్నారైలెవరికీ ఇండియా వెళ్లే అవకాశం లేదని యూఏఈలోని భారత ఎంబసీ తెలిపింది. కరోనా కట్టడి నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం జరిగిందని, ఈ సమయంలో ప్రవాసులను దేశంలోకి అనుమతిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని భారత రాయబారి పవన్ కపూర్ స్పష్టం చేశారు. దేశ పౌరులు, ప్రవాసీయుల ఆరోగ్య భద్రత దృష్ట్యా భారత సర్కార్ ఇలా కఠినంగా వ్యవహరిస్తుంది తప్పితే... ఎన్నారైలను దేశంలోకి అనుమతించకూడదని కాదని ఆయన తెలిపారు. ఇది అర్థం చేసుకొని భారత ప్రవాసులు ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచించారు. ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోయిన తర్వాత ఎన్నారైలు స్వదేశానికి వెళ్లొచ్చని భారత అంబాసిడర్ తెలియజేశారు.
Updated Date - 2020-04-12T18:09:01+05:30 IST