ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని కావాలనే కోరిక లేదు: రిషి సునక్

ABN, First Publish Date - 2020-08-07T23:06:37+05:30

‘బ్రిటన్ తదుపరి ప్రధాని రిషి సునకే’.. అని వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. ఓ రేడియో ఇంటర్యూలో తన మనసులోని మాటను బయటపెట్టా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ‘బ్రిటన్ తదుపరి ప్రధాని రిషి సునకే’.. అని వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. ఓ రేడియో ఇంటర్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. బ్రిటన్‌లోనూ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్.. కరోనా కట్టడికి, దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో.. బోరిస్ జాన్సన్ తర్వాత.. బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే సామర్థ్యం రిషి సునక్‌కు ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ‘బ్రిటన్ తదుపరి ప్రధాని రిషి సునకే’అన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఈ విషయంపై ఓ రేడియో ఇంటర్యూలో స్పందించిన ఆయన.. స్పష్టతనిచ్చారు. ‘బ్రిటన్ తదుపరి  ప్రధాని కావాలనే మీ కోరికను.. ప్రస్తుత సంక్షోభం తగ్గించిందా’ అన్న ప్రశ్నకు రిషి సునక్ బదులిస్తూ.. తనకు అలాంటి కోరికేదీ లేదని తేల్చిచెప్పారు. కరోనాపై చేస్తున్న పోరులో 24గంటలపాటు అవిశ్రాంతంగా పని చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ప్రస్తుతం తాను అలసిపోయినట్లు పేర్కొన్నారు. సంక్షోభం కారణంగా కుటుంబానికి, జిమ్‌కు కూడా దూరమైనట్లు చెప్పిన ఆయన.. ఈ వారంతంలో విశ్రాంతి తీసుకుని, మరింత చురుగ్గా పని చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. ఇదిలా ఉంటే.. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు అన్న విషయం తెలిసిందే. 


Updated Date - 2020-08-07T23:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising