ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనా ఎఫెక్ట్‌.. భారీగా ఉద్యోగాలు కోల్పోతున్న అమెరిక‌న్లు !

ABN, First Publish Date - 2020-05-22T19:29:10+05:30

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ల్లోలం కొన‌సాగుతోంది. ఈ వైర‌స్ దెబ్బ‌కు యూఎస్ విల‌విల్లాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్ డీసీ: అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ల్లోలం కొన‌సాగుతోంది. ఈ వైర‌స్ దెబ్బ‌కు యూఎస్ విల‌విల్లాడుతోంది. కోవిడ్ ధాటికి అగ్ర‌రాజ్యం ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల్ కావ‌డంతో అమెరిక‌న్లు భారీగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేసినా ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. గ‌త రెండు నెల‌ల కాల వ్య‌వ‌ధిలోనే సుమారు 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయిన‌ట్లు ప్ర‌భుత్వ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. దీంతో నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జూన్ వ‌ర‌కు ఈ నిరుద్యోగిత 20-25 శాతం పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ తెలిపింది. 90 ఏళ్ల క్రితం మ‌హా మాంద్యం స‌మ‌యంలో మాత్ర‌మే ఇలాంటి ప‌రిస్థితులు తలెత్తాయ‌ని, ఆ త‌ర్వాత ఇప్పుడేనంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలాఉంటే... అమెరికాలో విరుచుకుప‌డుతున్న 'కోవిడ్‌-19' ఇప్ప‌టివ‌ర‌కు 96వేల మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. అలాగే 16 ల‌క్ష‌ల‌కు పైగా మందికి సోకింది.    


Updated Date - 2020-05-22T19:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising