ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేస్తే.. ఇండియా నుంచి కరోనాను తరిమేయొచ్చు!

ABN, First Publish Date - 2020-04-10T05:34:14+05:30

కొవిడ్-19 మహమ్మారి చైనా జన్మించి.. ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా ‘పుట్టినిల్లు’ వుహాన్.. 76 రోజుల తర్వాత స్వేచ్ఛా వాయువు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: కొవిడ్-19 మహమ్మారి చైనాలో జన్మించి.. ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా ‘పుట్టినిల్లు’ వుహాన్.. 76 రోజుల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. చైనా ప్రభుత్వం బుధవారం రోజు వుహాన్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. దీంతో ప్రజలు మాస్కులు ధరించి వీధుల్లోకి వచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వుహాన్‌లో‌నే ఉండిపోయిన కొందరు భారతీయులు.. భారత్‌లో మహమ్మారిని నివారించేందుకు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు. 


సెల్ఫ్ ఐసోలేష్, కఠిన లాక్‌డౌన్ నిబంధనల ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని తేల్చిచెప్పారు. కేరళకు చెందిన హైడ్రోబయోలజిస్ట్‌ అరుణ్‌జీత్ టీ సత్రాజిత్.. తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘73 రోజులు నేను నా గది నుంచి బయటికి రాలేదు. నేను పని చేసే ల్యాబ్.. నా రూమ్‌కు దగ్గరగానే ఉంటుంది. కాబట్టి అధికారుల వద్ద అనుమతి తీసుకుని నేను పనికి వెళ్లాను. లాక్‌డౌన్ సమయంలో నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. మాట్లాడటానికి కూడా ఎవరూ లేరు. ఇన్ని రోజులపాటు తక్కువగా మాట్లాడటం వల్ల.. ప్రస్తుతం నేను మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. రెండు ప్రత్యేక విమానాలలో దాదాపు 700 మంది భారతీయులను ఇండియాకు తరలించారు. ఆ విమానాలలో ఇండియాకు రావడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే.. భారతీయులు కష్టాలకు భయపడరని నేను బలంగా నమ్ముతాను. అంతేకాకుండా నా కుటుంబం క్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నాను. అందుకే భారత్‌కు రాలేదు’ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. అయితే వర్షాకాలంలో ప్రజల రోగనిరోధక శక్తి తగ్గుతుందనీ.. ఆలోపు వైరస్‌ వ్యాప్తిని నియంత్రించకపోతే సమస్య జటిలమయ్యే అవకాశం ఉందన్నారు.


ఇదిలా ఉంటే.. వుహాన్‌లో పని చేస్తున్న భారతీయ సైంటిస్ట్.. అరుణ్‌జీత్ మాటలతో ఏకీభవించారు. కరోనా కట్టడికి స్వీయ నిర్భందమే శరణ్యమనీ.. లాక్‌డౌన్ నేపథ్యంలో భారత ప్రభుత్వం చేస్తున్న సూచనల్ని కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. 72 రోజులపాటు తాను కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. వుహాన్‌లో చిన్నపిల్లలు సైతం లాక్‌డౌన్ నిబంధనలను పాటించినట్లు చెప్పారు. తన ఇంటి పక్కన ఉండే ముగ్గురు చిన్నారులు.. లాక్‌డౌన్ సమయంలో కనీసం ఇంటి నుంచి బయటికి కూడా రాలేదన్నారు. కాగా.. వుహాన్‌లో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ.. కొంతమంది ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారని చెప్పారు. 

Updated Date - 2020-04-10T05:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising