ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ వీడియో: చూస్తుండగానే.. ఇళ్లను తనలో కలిపేసుకున్న సముద్రం..!

ABN, First Publish Date - 2020-06-06T01:41:16+05:30

పదుల సంఖ్యలో ఇళ్లను.. సముద్రం తనలో కలిపేసుకున్న ఘటన నార్వేలో చోటు చేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే అనేక ఇళ్లు స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్వే: పదుల సంఖ్యలో ఇళ్లను.. సముద్రం తనలో కలిపేసుకున్న ఘటన నార్వేలో చోటు చేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే అనేక ఇళ్లు సముద్రం పాలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్ 3న ఉత్తర నార్వేలోని అల్టా మున్సిపాలిటీ‌లో‌ అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పదుల సంఖ్యలో  ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను జాన్ అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం‌తో ప్రస్తుతం అది నెట్‌లో వైర‌ల్‌గా మారింది. కాగా.. తాను తృటిలో ప్రాణాలతో బయటపడ్డట్టు జాన్ పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనలో తన ఇల్లును కోల్పోయినట్లు వెల్లడించాడు. దీనిపై స్పందించిన అధికారులు.. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

వీడియో సోర్స్: ది టెలిగ్రాఫ్

Updated Date - 2020-06-06T01:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising