బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు
ABN, First Publish Date - 2020-11-03T10:01:16+05:30
క ఫేస్‌బుక్ పోస్ట్.. బంగ్లాదేశ్‌లో అల్లర్లు రాజేసింది. ఫ్రాన్స్‌లోని పారి్‌సలో ఒక ఉపాధ్యాయునికి శిరచ్ఛేదనం చేయడం, దానిపై ఆ దే
- అల్లర్లు రాజేసిన ఫ్రాన్స్ ఘటన
ఢాకా, నవంబరు 2: ఒక ఫేస్‌బుక్ పోస్ట్.. బంగ్లాదేశ్‌లో అల్లర్లు రాజేసింది. ఫ్రాన్స్‌లోని పారి్‌సలో ఒక ఉపాధ్యాయునికి శిరచ్ఛేదనం చేయడం, దానిపై ఆ దేశాధ్యక్షుడు ఇమ్మానియేల్ మేక్రాన్ స్పందిస్తూ.. అమానవీయ భావజాలాన్ని సహించేది లేదనడం విదితమే. ఆ మాటలతో ఉన్న ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌పై బంగ్లాలోని ఒక ప్రధానోపాధ్యాయుడితోపాటు పలువురు అనుకూల కామెంట్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో.. ఇస్లాంను అవమాన పరుస్తాన్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కొమిల్లా, బ్రాహ్మిన్‌బర్హియా జిల్లాలతోపాటు పలు చోట్ల హిందువులు, వారి ఇళ్లపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. అల్లర్లతో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
Updated Date - 2020-11-03T10:01:16+05:30 IST