ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా భర్త చావుకు తగిన న్యాయం జరగాలి: జార్జ్ ఫ్లాయిడ్ భార్య

ABN, First Publish Date - 2020-06-04T00:37:15+05:30

‘నా భర్త చావుకు సరైన న్యాయం జరగాలి’ అంటూ జార్జ్ ఫ్లాయిడ్ భార్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ‘నా భర్త చావుకు సరైన న్యాయం జరగాలి’ అంటూ జార్జ్ ఫ్లాయిడ్ భార్య రాక్సీ వాషింగ్టన్ డిమాండ్ చేశారు. మంగళవారం రాక్సీ తన కూతురితో పాటు మీడియా ముందుకు వచ్చారు. ‘నా భర్త ఫ్లాయిడ్‌కు కూతురు గియానా(6) అంటే ఎంతో ఇష్టం. ఫ్లాయిడ్ తన కూతురు ఎదుగుదలను చూడకుండానే మరణించాడు. తన కూతురిని విద్యావంతురాలిగా చూడకుండానే ప్రాణాలు వదిలాడు. నా కూతురు ఇప్పుడు తండ్రిని పోగొట్టుకుంది. నేను ఈ రోజు.. నా కూతురు, భర్త కోసమే మీడియా ముందుకు వచ్చాను. ఎందుకంటే నాకు న్యాయం కావాలి. ఫ్లాయిడ్ ఎంతో మంచివాడు. అలాంటి వ్యక్తి మరణానికి తగిన న్యాయం కోసమే నేను ఈ రోజు అందరి ముందుకు వచ్చాను. ఎవరు ఏమనుకున్నా జార్జ్ ఫ్లాయిడ్ చాలా మంచివాడు’ అని రాక్సీ తెలిపారు. కాగా.. శ్వేత పోలీసు అధికారుల చేతిలో మే 25న నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత అమెరికా అట్టుడుకుతోంది. లాస్ ఏంజెల్స్, ఫిలడెల్ఫియా, అట్లాంట, న్యూయార్క్, వాషింగ్టన్‌లలో నిరసనకారులు ర్యాలీలు నిర్విహిస్తున్నారు. ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచదేశాల్లోనూ జార్జ్ ఫ్లాయిడ్‌ మరణానికి నిరసనగా అనేక మంది ర్యాలీలు చేపట్టారు.

Updated Date - 2020-06-04T00:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising