ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతి వివక్ష వ్యతిరేక పోరుకు.. గూగుల్ భారీ విరాళం..!

ABN, First Publish Date - 2020-06-05T06:46:19+05:30

జార్జి ఫ్లాయిడ్ ఉదంతంపై అమెరికా సహా ప్రపంచ దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సంతతి టెక్ దిగ్గజం గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: జార్జి ఫ్లాయిడ్ ఉదంతంపై అమెరికా సహా ప్రపంచ దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సంతతి టెక్ దిగ్గజం గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి గూగుల్.. 37 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. అంతేకాకుండా జాతి అసమానతలను పరిష్కరించడం కోసం పని చేసే సంస్థలకు 12 మిలియన్ డాలర్లు, జాతి వివక్ష సమాచారాన్ని అందించే సంస్థలకు యాడ్ గ్రాంట్‌లలో 25 మిలియన్ డాలర్ల నిధులను గూగుల్ ఇస్తుందని ఆయన వెల్లడించారు. అంతకుముందు..8 నిమిషాల 46 సెకన్లపాటు మౌనం పాటించి, జాతి వివక్ష కారణంగా ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయులకు నివాళులర్పించాలని.. గూగుల్, ఆల్ఫాబెట్ ఉద్యోగులను ఆయన కోరారు. కాగా.. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని శ్వేతజాతి పోలీసు అధికారి అతికిరాతకంగా కాలితో తొక్కి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో నల్లజాతీయుతలంతా ఏకమై.. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆందోలనలు చేస్తున్నారు. కాగా.. జార్జి ఫ్లాయిడ్ హత్యను ఖండించిన సుందర్ పిచాయ్.. తాజాగా భారీ విరాళం ప్రకటించారు.  


Updated Date - 2020-06-05T06:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising