ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్మనీలో 24గంటల్లో 1,226 కేసులు

ABN, First Publish Date - 2020-08-13T14:06:05+05:30

జర్మనీలో గడిచిన 24గంటల్లో 1,226 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్‌, ఆగస్టు 12: జర్మనీలో గడిచిన 24గంటల్లో 1,226 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మే మొదటి వారం తర్వాత ఇన్ని కేసులు బయటపడడం ఇదే తొలిసారి. కాగా..   మళ్లీ కేసులు పెరుగుతుండడం పట్ల ఆ దేశ ఆరోగ్య  మంత్రి జెన్స్‌ స్పాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని, ప్రజలు పార్టీలు, సమావేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.  జర్మనీలో ఇప్పటివరకు 2,18,519 కేసులు నమోదవగా.. వారిలో 9,209 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఆస్ర్టేలియాలో 21 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 352కి పెరిగింది. మొత్తం బాధితుల సంఖ్య 22,127కి చేరుకుంది. అమెరికాలో కొత్తగా 54 వేల మందికి పాజిటివ్‌గా తేలగా.. మొత్తం కేసుల సంఖ్య 53 లక్షలకు చేరుకుంది. బ్రెజిల్‌లోనూ మరో 54,923.. రష్యాలో 5,102.. దక్షిణాఫ్రికాలో 2,511..న్యూజిలాండ్‌లో మరో 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 102 రోజుల తర్వాత కరోనా కేసులు రావడంతో వాటి మూలాలను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. పాకిస్థాన్‌లో కొత్తగా 730.. సింగపూర్‌లో మరో 42 మందికి వైరస్‌ సోకింది.  


Updated Date - 2020-08-13T14:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising