ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్ఫ్ నుంచి తిరిగొచ్చే కార్మికులకు.. ఉచితంగానే క్వారంటైన్..

ABN, First Publish Date - 2020-05-26T23:18:08+05:30

గల్ఫ్ నుంచి తెలంగాణకు వస్తున్న తెలంగాణ కార్మికులకు ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గల్ఫ్ నుంచి తెలంగాణకు వస్తున్న తెలంగాణ కార్మికులకు ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారితో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో అక్కడున్న తెలంగాణ వాసులు తమ స్వదేశానికి పయనమయ్యారు. గల్ఫ్ దేశాల టీఆర్ఎస్ శాఖల ప్రతినిధులు.. సతీష్ కుమార్ (బహ్రెయిన్) శ్రీధర్ అబ్దుగౌని(ఖతార్), మహిపాల్(ఒమాన్), షేక్  మహమ్మద్(సౌదీ), అభిలాష గొడిశాల(కువైట్), నరేష్, నర్సింహా(యూఏఈ) తెలంగాణ గల్ఫ్ కార్మికుల పరిస్థితిని తన దృష్టికి తీసుకువచ్చారని మహేష్ బిగాలా తెలిపారు. తాను ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని మహేష్ బిగాల తెలిపారు. నిరుపేద గల్ఫ్ కార్మికుల కోసం ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసినందుకు గల్ఫ్ దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందే భారత్  మిషన్ ద్వారా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా సమాచార విభాగం ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారు నేరుగా ఆ సమాచార విభాగం దగ్గరకు వెళ్తే వారు కోరుకున్న మేరకు క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. వారం రోజుల భోజనం, వసతికి కలిపి ప్రీమియం కేటగిరికి రూ. 16 వేలు, స్టాండర్డ్ కేటగిరికి 8వేలు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిరుపేద గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ క్రింది ఉచిత క్వారంటైన్ సెంటర్లలో వారికి భోజనం, వసతి ఉచితంగా అందిస్తారు.




Updated Date - 2020-05-26T23:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising