ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖాముఖి చర్చలో గెలిచిన ఈగ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

ABN, First Publish Date - 2020-10-08T16:39:29+05:30

అమెరికాలోని ఊటా రాష్ట్రంలో ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడివేడిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాల్ట్ లేక్ సిటి: అమెరికాలోని ఊటా రాష్ట్రంలో ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడివేడిగా ముఖాముఖి చర్చ సాగింది. ఈ చర్చలో ఎవరు గెలిచారన్న దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సహజంగా అయితే ఇరు పార్టీలకు చెందిన నేతల గురించి నెటిజన్లు మాట్లాడుకోవాలి. కానీ నెటిజన్లు అభ్యర్థుల సంగతి పక్కనపెట్టేసి ఓ ఈగ గురించి చర్చించుకుంటున్నారు. ఈ ముఖాముఖి చర్చలో గెలిచింది అభ్యర్థులు కాదని.. ఒక ఈగ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌లు మీద పోస్ట్‌లు పెడుతున్నారు. చర్చలో ఈగ గెలవడమేంటని అనుకుంటున్నారా? 


రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ జాత్యహంకారం, పోలీసు సంస్కరణల గురించి మాట్లాడే సమయంలో ఆయన తలపై ఓ ఈగ వాలింది. రెండు నిమిషాల పాటు ఈగ కదలకుండా మైక్ పెన్స్ తలపైనే ఉండటంతో అందరి కళ్లు ఈగ వైపు తిరిగాయి. కరోనా నేపథ్యంలో చీమ కూడా లోపలకు రాలేని విధంగా అధికారులు ప్లెక్సిగ్లాస్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఈగ మాత్రం ఎటునుంచో లోపలకు వచ్చేసింది. రావడమే కాకుండా మైక్ పెన్స్ తలపైనే విశ్రాంతి తీసుకుంది. ఇక నెటిజన్లు ఆగుతారా.. వెంటనే ఈగపై పోస్ట్‌లు వేయడం మొదలుపెట్టేశారు. 


‘ముఖాముఖి చర్చలో గెలిచింది మైక్ పెన్స్ కాదు.. కమలా హ్యారిస్ కాదు.. ఓ ఈగ ఈ చర్చలో గెలిచింది’ అంటూ నెటిజన్లు వెంటనే ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ‘ఓకే.. ఈ డిబేట్ ముఖ్యమైనదే. కానీ ప్రతి ఒక్కరు ఈగ గురించి తప్ప మరే అంశాన్ని గుర్తుపెట్టుకోరు’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘ఆ ఈగ మైక్ పెన్స్ తలలో చాలా సేపు ఉంది. ఈగ వెంటనే క్వారంటైన్‌కు వెళ్లాలి’ అంటూ మిస్సౌరి మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జేసన్ ట్వీట్ పెట్టారు. ఇదిలా ఉంటే.. ఓ నెటిజన్ ఏకంగా ‘మైక్‌పెన్స్‌ఫ్లై’ అంటూ ట్విట్టర్ ఖాతానే తెరిచేశాడు. విశేషమేంటంటే.. నిమిషాల్లోనే ఈ ఖాతాకు 60 వేల మంది ఫాలోవర్లు వచ్చేశారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్ సైతం ఈగపై స్పందించడం విశేషం.

Updated Date - 2020-10-08T16:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising