ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి నాటికి వ్యాక్సిన్ సిద్దం కావచ్చు: ఆంథనీ ఫౌచీ

ABN, First Publish Date - 2020-10-29T17:23:12+05:30

అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సిన్ జనవరి నాటికి సిద్దం కావొచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథనీ ఫౌచీ బుధవారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యాక్సిన్ తయారీ రేసులో ఉన్న ఐదు కంపెనీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సిన్ జనవరి నాటికి సిద్దం కావచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథనీ ఫౌచీ బుధవారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యాక్సిన్ తయారీ రేసులో ఉన్న ఐదు కంపెనీలు.. వ్యాక్సిన్‌కు సంబంధించిన డేటాను డిసెంబర్ వరకు సిద్దం చేసే పరిస్థితులు లేవని ఆయన అన్నారు. డిసెంబర్ తరువాత వ్యాక్సిన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కనీసం రెండు కంపెనీలైనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ‘వ్యాక్సిన్ జనవరిలో రావచ్చు.. ఇంకా ఆలస్యమైనా అవ్వచ్చు. మనం చెప్పలేం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.  


ఇక అమెరికాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందంటూ ఆయన హెచ్చరించారు. చలికాలంలో కరోనా మహమ్మారి ఊహించని విధంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని తెలిపారు. నిత్యం కేసుల సంఖ్య తగ్గుతూ రావాలని.. కానీ అమెరికాలో ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 91,21,800 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తం 2,33,137 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి.

Updated Date - 2020-10-29T17:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising