ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాసులకు ఒమన్‌లో ఆస్తి కొనుగోలు చేసే అవకాశం !

ABN, First Publish Date - 2020-10-19T13:46:27+05:30

ఒమన్‌లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: ఒమన్‌లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. గవర్నరేట్ ఆఫ్ మస్కట్‌లోని బహుళ అంతస్తుల భవనాల్లో అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయవచ్చు. గృహ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు తీర్మానాన్ని జారీ చేసింది. నాన్ ఒమానిస్ ఎవరైతే రెండేళ్లుగా సుల్తానేట్‌లో నివాసం ఉంటున్నారో వారు ఆస్తిని కొనుగోలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాపర్టీలు ప్రభుత్వం పేర్కొన్న సైట్లలోనే ఉంటాయి. అలాగే వీటికి గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ లైసెన్స్ జారీ చేస్తుంది. 


ఇక రిజిస్ట్రేషన్ ఫీజుల విషయానికి వస్తే... విక్రేత చెల్లించే ఫీజులు యూనిట్ విలువలో 3 శాతంగా ఉంటే... లబ్ధిదారునికి యూనిట్ విలువలో 5 శాతంగా ఉంటుంది. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రవాసులను ఆస్తి కొనుగోలు చేయమని ప్రోత్సహించడం తమ లక్ష్యమని మంత్రిత్వ శాఖ తన తీర్మానంలో పేర్కొంది. ఈ విధానం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పోటీతో కూడిన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి ఇది దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నగదును కూడా ప్రవేశపెడుతుందన్నారు. 

Updated Date - 2020-10-19T13:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising