ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విరుగుడుకు ‘యూకలిప్టస్‌ నెక్లెస్‌’!

ABN, First Publish Date - 2020-07-13T13:46:39+05:30

కరోనాకు వ్యాక్సిన్‌ను రూపొందించడంలో ప్రపంచ దేశాలన్నీ తలమునకలయ్యాయి. ఇండోనేషియా మాత్రం ‘యూకలిప్టస్‌ నెక్లెస్‌’ పేరిట ఒక గుర్తింపు కార్డు వంటి ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇండోనేషియా వ్యవసాయ శాఖ ప్రకటన
  • ప్రధాన వైర్‌సపై పరీక్షించలేదు: పరిశోధన విభాగం 

జకార్తా, జూలై 12: కరోనాకు వ్యాక్సిన్‌ను రూపొందించడంలో ప్రపంచ దేశాలన్నీ తలమునకలయ్యాయి. ఇండోనేషియా మాత్రం ‘యూకలిప్టస్‌ నెక్లెస్‌’ పేరిట ఒక గుర్తింపు కార్డు వంటి పరికరాన్ని కరోనాకు విరుగుడుగా ప్రకటించింది. యూకలిప్టస్‌(నీలగిరి) ఆకుల పొడి ఈ నెక్లె్‌సలో ఉంటుందని, ధరించిన వారు ఎప్పటికప్పుడు దాన్ని ఆఘ్రాణిస్తుండటంతో వైరస్‌ దరిచేరదని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి స్యారుల్‌ యాసిన్‌ లింపో ప్రకటించారు.


ఈ నెక్లస్‌ పావుగంట ధరిస్తే 42ు, అరగంటకు 80ు వైర్‌సను అంతమొందిస్తుందని ఆయన తెలిపారు. దీని నుంచి వచ్చే ఆవిరి, వైర్‌సలోని ప్రొటీన్‌ నిర్మాణాన్ని నాశనం చేస్తుందన్నారు. అయితే.. దీన్ని ఆల్ఫా కరోనా, బీటా కరోనా వంటి అతి సాధారణ వైర్‌సలపైనే పరిశోధించామని, అసలు వైరస్‌ అయిన కొవిడ్‌-19పై చేయలేదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశోధన విభాగం డైరెక్టర్‌ ఫాడ్‌జ్రీ జుఫ్రీ వెల్లడించారు. కణ నిర్మాణాన్ని ఉపయోగించి ఆ వైర్‌సను అభివృద్ధిపరచే సామర్థ్యం తమ దేశంలోని ఏ పరిశోధనశాలకూ లేకపోవడమే అందుక్కారణమన్నారు. 


Updated Date - 2020-07-13T13:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising