ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో కొత్త చట్టం..

ABN, First Publish Date - 2020-09-26T16:34:48+05:30

యూఏఈ సర్కార్ తాజాగా కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే మగాళ్లతో పాటు ఆడవాళ్లకు సమాన వేతనం చెల్లించాలనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మగాళ్లతో పాటు ఆడవాళ్లకు సమాన వేతనం

అబుధాబి: యూఏఈ సర్కార్ తాజాగా కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే మగాళ్లతో పాటు ఆడవాళ్లకు సమాన వేతనం చెల్లించాలనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. సెప్టెంబర్ 25 నుంచే ఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఇకపై ఒకే పనిచేసే మహిళలు, పురుషులకు సమాన వేతనం ఇవ్వబడుతుందని ఆయన పేర్కొన్నారు. వేతనాలు జెండర్ ఆధారంగా కాకుండా మార్కెట్ ప్రమాణాల ద్వారా నిర్ణయించబడతాయని తెలిపారు. కార్మిక సంబంధాల నియంత్రణకు సంబంధించి 1980లో చేసిన ఫెడరల్ లా నెంబర్ 08లోని ఆర్టికల్ 32 ప్రకారం మగాళ్లతో పాటు ఆడవాళ్లకు సమాన వేతనం చెల్లించాలనే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు జాయెద్ అల్ నహ్యాన్ చెప్పారు. 


ఈ ఉత్తర్వు ఎమిరేట్స్‌లో మహిళలను సాధికారపరిచే ప్రక్రియలో కొత్త సానుకూల దశ అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ అన్వర్ గార్గాష్ అన్నారు. ఈ చర్య "నిస్సందేహంగా మహిళల సామాజిక చేరికను పెంచుతుంది. జాతీయ అభివృద్ధిలో వారి పాత్రకు మద్దతు ఇస్తుంది. ప్రపంచ లింగ సమానత్వ సూచికలో యూఏఈ స్థితిని మెరుగుపరుస్తుంది" అని యూఏఈ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు షేఖా మనల్ బింట్ మొహమ్మద్ అల్ మక్తూమ్ అన్నారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న మహిళలందరికీ ఆమె కంగ్రాట్స్ చెప్పారు.

Updated Date - 2020-09-26T16:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising