ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్నతాధికారుల ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. అమెరికాలో పోలీసులు రాజీనామా!

ABN, First Publish Date - 2020-06-06T22:23:09+05:30

అమెరికాలో పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చశారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై నిరసన తెలుపుతూ 57 మంది పోలీసులు త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చశారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై నిరసన తెలుపుతూ 57 మంది పోలీసులు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని శ్వేతజాతి పోలీసు అధికారి కాలితో తొక్కి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అమెరికాలో నల్లజాతీయులు ఒక్కటయ్యారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాతి వివక్ష వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 75ఏళ్ల వృద్ధుడిపట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. పోలీసులు ఆ వృద్ధడ్ని కిందకు తోసేయడంతో అతని తలకు దెబ్బతగిలి రక్తస్రావం అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. వృద్ధడ్ని కిందకు తోసేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 57 మంది పోలీసులు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు.


Updated Date - 2020-06-06T22:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising