ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాను రెడ్ జోన్ దేశంగా గుర్తించిన బ్రిటన్..!

ABN, First Publish Date - 2020-07-04T03:53:41+05:30

కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై విధించిన క్వారెంటైన్ నింబంధనలకు బ్రిటన్ ప్రభుత్వం సవరణలు చేసింది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న దేశాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై విధించిన క్వారెంటైన్ నింబంధనలకు బ్రిటన్ ప్రభుత్వం సవరణలు చేసింది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారెంటైన్ నిబంధన నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజిచింది. స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, తదితర దేశాలను గ్రీన్ జోన్ దేశాలుగా గుర్తించింది. జూలై 10 నుంచి గ్రీన్ జోన్ దేశాల నుంచి ఇంగ్లాండ్‌కు వచ్చే ప్రయాణికులు 14రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా.. గ్రీన్ జోన్ దేశాలకు సంబంధించిన మొత్తం జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో.. అగ్రరాజ్యాన్ని రెడ్ జోన్ దేశంగా బ్రిటన్ ప్రభుత్వం గుర్తించింది. కాగా.. భారత్ ఏ జోన్‌లోకి వస్తుందనేది మాత్రం బ్రిటన్ వెల్లడించలేదు. ఇదిలా ఉంటే  బ్రిటన్‌లో ఇప్పటి వరకు 2.84లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. 44వేల మందికిపైగా మరణించారు. 


Updated Date - 2020-07-04T03:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising