ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.. కుటుంబ సభ్యులను కలుసుకున్నారు!

ABN, First Publish Date - 2020-07-13T17:34:54+05:30

షీనా సలీమ్.. యూఏఈలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. విశ్రాంతి కోసం ఈ ఏడాది మార్చి 14న కేరళకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: షీనా సలీమ్.. యూఏఈలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. విశ్రాంతి కోసం ఈ ఏడాది మార్చి 14న కేరళకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఇండియాలో కరోనా వైరస్ విజృంభణ మొదలైంది. దీంతో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇక్కడే చిక్కుకున్నారు. 


అనుపమ్ నైర్.. దుబాయ్‌కి చెందిన బేస్ బ్యాండ్‌లో సింగర్. ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉండటంతో మార్చిలో ఇండియాకు వచ్చారు. లాక్‌డౌర్ కారణంగా ఇక్కడే చిక్కుకున్నారు. అయితే చార్టెడ్ విమానాల్లో యూఏఈకి దుబాయికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ అర్ధాంతరంగా అవి రద్దు కావడంతో చేసేది ఏం లేక ఇక్కడే ఉండిపోయారు.ఇలా వివిధ కారణాల వల్ల ఇండియాకు వచ్చి, లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకున్న యూఏఈ రెసిడెంట్స్‌లో కొందరు నిన్న తిరిగి యూఏఈకి చేరుకున్నారు. దాదాపు మూడు, నాలుగు నెలల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు షార్జా, దుబాయిలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు వేదికయ్యాయి. కాగా.. లాక్‌డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుకున్న యూఏఈ నివాసితుల కోసం.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా 15 రోజులపాటు యూఏఈకి ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు భారత పౌర విమానయానశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు కొందరు యూఏఈ రెసిడెంట్స్ ఇండియా నుంచి తరలి వెళ్లారు. 


Updated Date - 2020-07-13T17:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising