ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ఎన్నికల్లో పంజాబీల హవా !

ABN, First Publish Date - 2020-10-26T17:36:08+05:30

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ఎన్నికల్లో ఎనిమిది మంది పంజాబీలు విజయఢంకా మోగించారు. గెలిచిన 8 మంది కూడా రూలింగ్ పార్టీ న్యూ డెమొక్రటిక్ చెందినవారు కావడం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ఎన్నికల్లో ఎనిమిది మంది పంజాబీలు విజయఢంకా మోగించారు. గెలిచిన 8 మంది కూడా రూలింగ్ పార్టీ న్యూ డెమొక్రటిక్ చెందినవారు కావడం గమనార్హం. దీంతో మొత్తం 87 సీట్లు గల హౌస్‌లో 55 స్థానాల్లో విజయం సాధించి మరోసారి న్యూ డెమొక్రటిక్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. గెలిచిన ఎనిమిది మందిలో ముగ్గురు ఐదోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. కార్మిక మంత్రి హ్యారీ బైన్స్, డిప్యూటీ స్పీకర్ రాజ్ చౌహాన్, పార్లమెంటరీ కార్యదర్శి జాగ్రూప్ బ్రార్ ఇలా వరుసగా ఐదోసారి విజయం సాధించారు. సర్రే-న్యూటన్ నుంచి గెలిచిన బెయిన్స్ లిబరల్ పార్టీకి చెందిన పాల్ బోపోరాయ్‌ను ఓడించారు. 


బర్నాబీ-ఎడ్మండ్స్ నుంచి గెలిచిన చౌహాన్.. లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్, ఎస్ఏడీ నాయకుడు చరంజిత్ సింగ్ అట్వాల్ కుమార్తె(లిబరల్ పార్టీ)పై భారీ మెజారిటీతో గెలిచారు. బ్రార్ మరోసారి సర్రే-ఫ్లీట్‌వుడ్ సీటును నిలుపుకున్నారు. కాగా, సర్రే-గ్రీన్ టింబర్స్ నుంచి రచనా సింగ్ విజయం సాధించారు. లిబరల్ పార్టీకి చెందిన దిల్‌రాజ్ అత్వాల్‌ను ఆమె ఓడించారు. అలాగే రవి కహ్లాన్ మరోసారి డెల్టా నార్త్‌ సీటును దక్కించుకున్నారు. అమన్ సింగ్ రిచ్మండ్-క్వీన్స్‌బరో నుండి జాస్ జోహాల్‌పై అలవోక విజయం సాధించారు. జిన్నీ సిమ్స్, నికీ శర్మ వరుసగా సర్రే-పనోరమా, వాంకోవర్-హేస్టింగ్స్ నుండి గెలిచారు.

Updated Date - 2020-10-26T17:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising