ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ ప్రవాసులపై డచ్ ప్రధాని ప్రశంసల జల్లు !

ABN, First Publish Date - 2020-11-25T22:39:54+05:30

డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే భారతీయ ప్రవాసులపై ప్రశంసల జల్లు కురిపించారు. వారు సాధించిన విజయాలు, మా సమాజానికి వారు చేసిన కృషి మాకు ఎంతో గర్వకారణం అని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ది హేగ్: డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే భారతీయ ప్రవాసులపై ప్రశంసల జల్లు కురిపించారు. వారు సాధించిన విజయాలు, మా సమాజానికి వారు చేసిన కృషి మాకు ఎంతో గర్వకారణం అని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని అన్నారు. నెదర్లాండ్స్‌లోని భారత రాయబారి వేణు రాజమోనీకి రాసిన లేఖలో రుట్టే ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా.. 2017, జూన్ నుంచి డచ్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్న రాజమోనీ పదవి కాలం ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే భారత రాయబారికి రుట్టే లేఖ రాశారు. ఈ సందర్భంగా భారత్, నెదర్లాండ్ మధ్య ఉన్న ఏడు దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధం గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. నీరు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనంతో సహా వివిధ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. 


"నెదర్లాండ్స్, భారతదేశం 70 సంవత్సరాల నుంచి ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగిస్తున్నాయి. నీరు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనంతో సహా వివిధ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అలాగే ఇరు దేశాలకు మానవ హక్కుల మండలి, అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్యత్వం సహా ఇతర రంగాలలో కూడా మేము కలిసి పనిచేస్తున్నాము. ఐరోపాలో భారతీయ ప్రవాసులు అధికంగా ఉండే దేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి. వారి విజయాలు, మన సమాజానికి వారు చేసిన కృషి మాకేంతో గర్వకారణం. ఇండో-డచ్ ద్వైపాక్షిక సంబంధం మునుముందు కూడా ఇలాగే కొనసాగుతుందనే నమ్మకం మాకుంది." అని ప్రధాని తన లేఖలో రాసుకొచ్చారు.

Updated Date - 2020-11-25T22:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising