ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌త్‌లోని దుబాయ్ రెసిడెంట్స్‌కు.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీల‌క సూచ‌న‌

ABN, First Publish Date - 2020-08-14T17:29:43+05:30

ఇండియాలోని దుబాయ్ రెసిడెన్సీ వీసాదారుల‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గురువారం కీల‌క సూచ‌న చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ఇండియాలోని దుబాయ్ రెసిడెన్సీ వీసాదారుల‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గురువారం కీల‌క సూచ‌న చేసింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్(ఐసీఏ) లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (జీడీఆర్‌ఎఫ్ఏ) అనుమతి లేకుండా తిరిగి వచ్చే నివాసితులను దేశంలోకి అనుమతించే నిర్ణయాన్ని దుబాయ్‌ ఉపసంహరించుకుంద‌ని తెలియజేసింది. ఈ మేర‌కు ట్వీట్ చేసిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్... "దుబాయ్‌కు తిరిగి వెళ్తున్న భార‌త్‌లోని దుబాయ్‌ రెసిడెన్సీ వీసా హోల్డర్లు ఐసీఏ లేదా జీడీఆర్‌ఎఫ్ఏ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి" అని పేర్కొంది.


ఇదిలా ఉంటే... దుబాయ్‌లో మహ‌మ్మారి క‌రోనా వైర‌స్ ఇప్పుడిప్పుడే కాస్తా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 63,489 మంది కోవిడ్ బారిన ప‌డ‌గా... 57,372 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో 5,759 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్ప‌టికే 358 మందిని ఈ మ‌హ‌మ్మారి పొట్ట‌న‌బెట్టుకుంది.   

Updated Date - 2020-08-14T17:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising