ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు భార్యలున్న వ్యక్తి.. రెండిళ్లకూ తిరిగేందుకు పర్మిషన్‌‌కై పోలీసులకు ఫోన్ చేస్తే..

ABN, First Publish Date - 2020-04-08T21:37:30+05:30

కరోనాను కట్టడి చేసేందుకు యూఏఈ ప్రభుత్వం స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఇళ్లు వదిలి బయటకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: కరోనాను కట్టడి చేసేందుకు యూఏఈ ప్రభుత్వం స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రాకూడదు. కేవలం అత్యవసర సేవలకు హాజరయ్యే వారు మాత్రమే బయటకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. ఒకవేళ ఎవరైనా బయటకు రావాలంటే పర్మిట్ తప్పనిసరి అని సూచించింది. ఇదిలా ఉండగా.. ప్రజలకు ఎదురయ్యే అనుమానాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా పోలీసు అధికారులు ప్రజల సందేహాలను తీర్చుతున్నారు. అయితే దుబాయికి చెందిన ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు పోలీసు అధికారికి నవ్వు ఆగలేదు. 


ఇంతకూ ఆ వ్యక్తి ఏం అడిగాడంటే.. ‘సార్.. నాకు ఇద్దరు భార్యలు. ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరగాల్సి ఉంటుంది. మరి నేను పర్మిట్ తీసుకోవాలా?’ అని అడిగాడు. ఈ ప్రశ్నకు పోలీసు అధికారి నవ్వుతూ.. పర్మిట్ పొందకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు. పర్మిట్ కేవలం ఒకసారి మాత్రమే పనిచేస్తుందని.. ఈ లెక్కన నిత్యం పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని సమాధానం ఇచ్చారు. రెండో భార్యను కలవకుండా ఉండటం మంచి నిర్ణయమని అధికారి కాలర్‌కు సూచించారు. కాగా.. యూఏఈ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,300 మంది కరోనా బారిన పడ్డారు. 186 మంది పూర్తిగా కోలుకోగా.. 12 మంది మృతిచెందారు.

Updated Date - 2020-04-08T21:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising