సాధారణ వైద్య సేవలకు దుబాయ్ గ్రీన్ సిగ్నల్..!
ABN, First Publish Date - 2020-06-01T17:26:58+05:30
కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. యూఏఈలోనూ దీని తీవ్రత అధికంగానే ఉంది. అయినప్పటికీ దుబాయి హెల్త్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
దుబాయి: కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. యూఏఈలోనూ దీని తీవ్రత అధికంగానే ఉంది. అయినప్పటికీ దుబాయి హెల్త్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర వ్యాధి గ్రస్థులకు కూడా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా.. కరోనా వైరస్ నేపథ్యంలో దుబాయిలో కూడా లాక్‌డౌన్ అమలయింది. ఈ నేపథ్యంలో దుబాయిలోని ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు రద్దు అయ్యాయి. తాజాగా లాక్‌డౌన్ నిబంధనలను అక్కడి ప్రభుత్వం క్రమంగా సడలిస్తోంది. పార్కులు, మాల్స్ తెరిచేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దుబాయి వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు దుబాయి హెల్త్ అథారిటీ ప్రకటించింది. సాధారణ వైద్య సేవల గురించి ఆసుపత్రుల్లోకి వచ్చే వారికి కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దుబాయి హెల్త్ కార్పోరేషన్ సీఈఓ యూనిస్ కాజీమ్ పేర్కొన్నారు. అంతేకాకుండా కొవిడ్ బారినపడుతున్న వారిలో కేవలం 0.6 శాతం మందికి మాత్రమే ఐసీయూ సేవలు అవసరమవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
Updated Date - 2020-06-01T17:26:58+05:30 IST