ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ వీడియో పోస్ట్.. నెట్టింట హల్‌చల్!

ABN, First Publish Date - 2020-08-13T23:18:50+05:30

దుబాయి క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దుబాయి క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్.. గత కొంత కాలంగా మెర్సిడెన్ ఎస్‌యూవీ కారును ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో గ్యారేజ్‌లో ఉన్న షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ కారుపై ఓ పావురం గూడును నిర్మించుకుంది. పావురం కారుపై గూడు కట్టుకోవడాన్ని గమనించిన ఆయన.. దానిపై జాలిపడి, ఆ కారును ఉపయోగించకుండా వదిలేశారు. ఈ నేపథ్యంలో ఆ పావురం.. కారుపై నిర్మించుకున్న గూడులో గుడ్లుపెట్టింది. తాజాగా పావురం పెట్టిన గుడ్లలోంచి పిల్లలు బయటికొచ్చాయి. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అవ్వడంతో.. ఆ వీడియోను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. 


Updated Date - 2020-08-13T23:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising