ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొండిపట్టు వీడిన ట్రంప్.. అమెరికన్లకు భారీ ఊరట!

ABN, First Publish Date - 2020-12-29T12:48:09+05:30

అమెరికన్లకు అధ్యక్షుడు డొనాల్డ్‌ భారీ ఊరట కల్పించారు. రూ 2.3 లక్షల కోట్ల డాలర్ల వ్యయానికి సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. ఇందులో 900 కోట్ల డాలర్ల ఉపశమన ప్యాకేజీ కూడా ఉంది. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది ప్రజలకు ఈ బిల్లుతో ఆర్థిక సాయం అందనుంది. ట్రంప్‌ ఈ బిల్లును చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టిబెట్‌పై చైనా జోక్యానికి చెక్‌ 

లాసాలో కాన్సులేట్‌ ఏర్పాటుకూ ఓకే 

వాషింగ్టన్‌, డిసెంబరు 28: అమెరికన్లకు అధ్యక్షుడు డొనాల్డ్‌ భారీ ఊరట కల్పించారు. రూ 2.3 లక్షల కోట్ల డాలర్ల వ్యయానికి సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. ఇందులో 900 కోట్ల డాలర్ల ఉపశమన ప్యాకేజీ కూడా ఉంది. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది ప్రజలకు ఈ బిల్లుతో ఆర్థిక సాయం అందనుంది. ట్రంప్‌ ఈ బిల్లును చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టారు. వచ్చే 20న పదవీ కాలం ముగుస్తుండడం, అమెరికా కాంగ్రెస్‌ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండడంతో ఎట్టకేలకు ఆయన బిల్లుపై సంతకం చేశారు. దీంతో పాటు అమెరికా-భారత్‌ల మధ్య విజ్ఞానవంతుల వేదికను ఏర్పాటు చేసే ‘గాంధీ-కింగ్‌ స్కాలర్లీ ఎక్స్చేంజ్‌ బిల్లు’పై కూడా ట్రంప్‌ సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం గాంధీ-కింగ్‌ విజ్ఞానవంతుల మార్పిడి కార్యక్రమానికి 2025 వరకు ఏటా 10 లక్షల డాలర్లను ఖర్చు చేయనున్నారు.


టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌

టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేశారు. ఈ బిల్లుతో టిబెట్‌పై చైనా జోక్యానికి చెక్‌ పెట్టినట్లయింది. టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ సంబంధాలు ఏర్పడి.. టిబెట్‌ బౌద్ధ వర్గాలు దలైలామాను తమ నేతగా ఎన్నుకునే అవకాశం కలుగుతుంది.’

Updated Date - 2020-12-29T12:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising