ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ పెద్ద కుమారుడి గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా..

ABN, First Publish Date - 2020-07-04T19:07:33+05:30

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడి గర్ల్‌ఫ్రెండ్‌ కింబర్లీ గ్యుయల్‌ఫాయల్‌కు కరోనా సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడి గర్ల్‌ఫ్రెండ్‌ కింబర్లీ గ్యుయల్‌ఫాయల్‌కు కరోనా సోకింది. ఇటీవల ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్ష జరపగా పాజిటివ్ అని తేలింది. కింబర్లీ గ్యుయల్‌ఫాయల్ గతంలో ఫాక్స్‌ టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత కొంత కాలంగా ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో డేటింగ్‌లో ఉన్నారు.


అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమె అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం వినేందుకు దక్షిణ డకోటా రాష్ట్రానికి వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం ట్రంప్‌ను కలిసేవారందరికీ అక్కడి అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కింబర్లీ కూడా కరోనా బారిన పడ్డట్టు వెల్లడైంది.


విషయం తెలియగానే అధికారులు ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు.  ‘ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నారు. కరోనా లక్షణాలు ఏవీ కింబర్లీలో లేనందువల్ల మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించి వ్యాధి సోకిందీలేనిదీ రూఢి పరుచుకుంటాం’ అని అధికారులు వెల్లడించారు. 


ఇక ట్రంప్‌కు దగ్గరగా మసలిన వారిలో కరోనా బారిన పడ్డ మూడో వ్యక్తి కింబర్లీ. అంతకుమునుపు..అమెరికా ఉపాధ్యక్షుడి ప్రెసె సెక్రెటరీ, ట్రంప్ సహాయకుడు కరోనా బారినపడ్డారు. మరోవైపు.. అమెరికాలో కరోనాకు బలైన వారి సంఖ్య దాదాపు 1.3 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో దేశం మొత్తం మరోసారి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కుంటోందని అని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథొని ఫౌచీ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-07-04T19:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising