ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ పేరును మర్చిపోయిన జో బైడెన్.. ఏమని పిలిచారంటే..

ABN, First Publish Date - 2020-10-28T05:20:26+05:30

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో డెమొక్రటిక్ పార్టీ తరపున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును మర్చిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న జో బైడెన్.. ట్రంప్‌ను ‘జార్జ్’ అంటూ సంభోధించారు. ‘మరో నాలుగేళ్ల పాటు జార్జ్ అధ్యక్షుడిగా ఉంటే.. అమెరికా అస్తవ్యస్థం అయిపోతుంది’ అని ఆయన వర్చువల్ కార్యక్రమంలో తెలిపారు. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన పేరునే జో బైడెన్ గుర్తుపెట్టుకుని ఈ విధంగా సంభోధించినట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని జో బైడెన్ ట్రంప్ పేరును మర్చిపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


మరోపక్క ఈ ఘటనపై ట్రంప్ కూడా స్పందించారు. ‘జో బైడెన్ నిన్న నన్ను జార్జ్ అని పిలిచారు. ఆయన నా పేరును కూడా గుర్తుపెట్టుకోలేదు’ అని ట్వీట్ చేశారు. జో బైడెన్ అధ్యక్ష పదవికి అనర్హుడని.. మానసికంగా ఆయన పరిస్థితి బాగోలేదని ఆరోపించారు. గతంలోనూ ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేశారు. కాగా.. జో బైడెన్ వయసు 77 ఏళ్లు. ఒకవేళ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే అధ్యక్ష పదవి చేపట్టిన అతిపెద్ద వయస్కుడిగా ఆయన రికార్డు కొడతారు.

Updated Date - 2020-10-28T05:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising