ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొరబడిన ట్రంప్..!

ABN, First Publish Date - 2020-12-06T14:11:49+05:30

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఓటమిని అంగీకరించని విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బైడెన్ విజయం సాధించిన జార్జియాలో తాను  గెలిచినట్లు ప్రకటన

జార్జియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఓటమిని అంగీకరించని విషయం తెలిసిందే. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై కోర్టు మెట్లు ఎక్కిన ట్రంప్‌కు చుక్కెదురైన తన పంతాను మాత్రం మార్చుకోవడం లేదు. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలాఉంటే... శనివారం రాత్రి జార్జియాలో జరిగిన రిపబ్లికన్స్ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ పొరబడ్డారు. జార్జియాలో మనం గెలిచాం అని ప్రకటించుకున్నారు. కానీ, ఈ రాష్ట్రంలో డెమొక్రటిక్ నేత జో బైడెన్ 12,500 ఓట్ల తేడాతో ట్రంప్‌ను ఓడించారు. ట్రంప్ మాత్రం.."మీకు తెలుసు.. జార్జియాలో మనమే గెలిచాం." అని మద్దతుదారులతో అన్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన బైడెన్.. ఎలక్టోరల్ కాలేజీలో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటే తాను వైట్‌హౌస్ ఖాళీ చేస్తానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ఎలక్టోరల్ కాలేజీ సమావేశం ఉంది. ఈ భేటీలోనే ఎలక్టోర్స్ అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అనంతరం జనవరి 20న కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.    

Updated Date - 2020-12-06T14:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising