ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో రప్ఫాడిస్తున్న ట్రంప్ !

ABN, First Publish Date - 2020-11-04T16:34:07+05:30

అమెరికా అధ్యక్ష పీఠానికి దగ్గర చేసే కీలకమైన ఫ్లోరిడాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి సర్వేలన్నీ ఇక్కడ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష పీఠానికి దగ్గర చేసే కీలకమైన ఫ్లోరిడాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి సర్వేలన్నీ ఇక్కడ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. కానీ, ట్రంప్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలంటే తప్పక గెలవాల్సిన ఫ్లోరిడాలో ముందంజలో ఉండడం ఆయన పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక రిపబ్లికన్ పార్టీ శ్రేణులైతే ఇప్పటికే తాము ఫ్లోరిడాలో గెలిచినట్లు ప్రకటించుకుని సంబరాల్లో మునిగితేలుతున్నాయి. అలాగే 2016లో ట్రంప్‌ను అధ్యక్ష పీఠం ఎక్కించిన 'బ్లూ వాల్‌'గా పిలువబడే మిచిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలపై బైడెన్ ఈసారి పట్టు సాధించినట్లు సమాచారం. 


కానీ, ఈ రాష్ట్రాల ఫలితాలు విడుదల కావటానికి సమయం పట్టనుంది. ఇక కీలక స్వింగ్ రాష్ట్రాలైన నార్త్ కరోలినా, ఓహియో, టెక్సాస్‌ ఫలితాలు కూడా రావాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా బైడెన్ 213 ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకోగా... ట్రంప్ 138 ఓట్లు పొందారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 270కు బైడెన్ దగ్గరయ్యారనే చెప్పాలి.


ఇరువురు అభ్యర్థులు గెలిచిన రాష్ట్రాల వారిగా ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే...


డొనాల్డ్ ట్రంప్(138):

అలబామా(09), అర్కాన్సాస్(06), ఇండియానా(11), కాన్సాస్(06), కెంటుకీ(08), మిస్సిసిప్పీ(06), మిస్సోరి(10), నెబ్రాస్కా(05), నార్త్ డకోటా(03), ఓక్లహోమా(07), సౌత్ కరోలినా(09), సౌత్ డకోటా(09), టెన్నెస్సీ(11), ఉతాహా(06), వెస్ట్ వర్జినియా(05), వ్యోమింగ్(03), ఇదాహో(04), ఓహియో(18), లూసియానా(08).

జో బైడెన్(209):

కాలిఫోర్నియా(55), కొలరాడో(09), కనెక్టికట్(07), డేలావెర్(03), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా(03), ఇల్లినాయిస్(20), మెరీల్యాండ్(10), మసాచుసెట్స్(11), న్యూ హ్యాంప్‌షైర్(04), న్యూజెర్సీ(14), న్యూమెక్సికో(05), న్యూయార్క్(29), ఒరెగాన్(07), రోల్ ఐలాండ్‌(04), వెర్మాంట్(03), వర్జినియా(13), వాషింగ్టన్(12), హవాయి(04).

Updated Date - 2020-11-04T16:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising